శ్రీకాకుళంలో చికెన్ ధరలు

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం చికెన్, మటన్, చేపల ధరలు పెరిగాయి. బాయిలర్ స్కిన్ చికెన్ కిలో రూ. 210, స్కిన్‌లెస్ రూ. 220, నాటుకోడి రూ. 800కి విక్రయించారు. గత వారంతో పోలిస్తే ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మటన్ కిలో రూ. 800, చేపలలో బొచ్చలు రూ. 250, కోరమీను రూ. 450కి అమ్మకాలు జరుగుతున్నాయి.