'తలైవార్ 173' సుందర్ అవుట్.. ఖుష్బూపై ట్రోల్స్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ 'తలైవార్ 173' మూవీ నుంచి దర్శకుడు సుందర్. సి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఖుష్బూను స్పెషల్ సాంగ్ చేయమన్నారని, అందుకే ఆమె భర్త సుందర్ తప్పుకున్నాడని ట్రోల్స్ వస్తున్నాయి. దీనిపై ఖుష్బూ స్పందిస్తూ.. 'లేదు ఐటెం సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు. మీ కుటుంబంలో ఎవరినైనా చేయమన్నారేమో' అని పోస్ట్ పెట్టారు.