'విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి'
NZB: ధర్పల్లి మండలంలోని 39 ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించారు. మైలారం పాఠశాలలో జరిగిన సమావేశానికి ఎంఈవో రమేశ్ కుమార్ హాజరై కీలక సూచనలు చేశారు. సెలవుల్లో విద్యార్థుల ప్రవర్తనను గమనిస్తూ, వారు సక్రమ మార్గంలో పయనించేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.