VIDEO: అధికార పార్టీపై ప్రశ్నించినందుకు దాడులు..!
అన్నమయ్య: రాయచోటి వైఎస్ఆర్‌సీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, ఆకేపాటి అమరనాధ రెడ్డి సోమవారం ఎస్పీ ధీరజ్‌ను కలిసి బీసీ నాయకుడు విజయ భాస్కర్‌పై జరిగిన దాడి, ఇతర వర్గీయ దాడులపై ఫిర్యాదు చేశారు. ముసుగులు ధరించి దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.