VIDEO: ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు పూర్తి

ప్రకాశం: తెలంగాణ - ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో మావోయిస్టుల దాడిలో పెదచెర్లోపల్లి మండలం కొత్త ముద్దపాడుకు చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ పవన్ కళ్యాణ్ అంతిమయాత్రను శుక్రవారం నిర్వహించారు. వందలాదిమంది గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.