కనిగిరిలో క్షుద్ర పూజల కలకలం
మార్కాపురం జిల్లా కనిగిరిలో శుక్రవారం క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకలం రేపాయి. స్థానిక కాశీనాయన గుడికి వెళ్లే దారిలో సత్యం రెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటిముందు ముగ్గు వేసి అందులో కోడి గుడ్లు పెట్టిన దృశ్యాలు కనిపించాయి. ముగ్గులో సత్యం అని పేరు రాసి ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. భయబ్రాంతులకు గురి చేసేందుకే క్షుద్ర పూజలు చేశారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.