మీర్పేట్ మున్సిపల్ ఆఫీస్ వద్ద బీజేపీ ఆందోళన

HYD: మీర్పేట్ మున్సిపల్ కార్యాలయం వద్ద టెన్షన్ నెలకొంది. ఒకేసారి భారీగా పెరిగిన ఇంటి పన్ను తగ్గించాలని బీజేపీ గత కొద్దిరోజులుగా ఆందోళన బాట పట్టింది. ఇందులో భాగంగా మీర్పేట్ మున్సిపల్ కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్షకు పూనుకుంది. పేద, బడుగు, మధ్య, సామాన్య ప్రజలపై భారం పడుతున్న పెంచిన పన్ను ధరలను వెంటనే తగ్గించాలని లతశ్రీ మండిపడ్డారు.