'ప్లాస్టిక్ కవర్లు అమ్మితే చర్యలు తప్పవు'
NDL: బేతంచెర్ల పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు అమ్మితే చర్యలు తప్పవని నగర కమిషనర్ హరిప్రసాద్ హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని తోపుడుబండ్లు పలు దుకాణాలను నగర కమిషనర్ హరిప్రసాద్ తనిఖీలు నిర్వహించారు. పలు దుకాణాలలో ప్లాస్టిక్ కవర్లు బయటపడటంతో ఆయన వ్యాపారస్తులపై మండిపడ్డారు. మరొక్కసారి ప్లాస్టిక్ కవర్లను అమ్మితే కేసులు నమోదు చేస్తామని కమిషనర్ తెలిపారు.