పేకాట శిబిరం పై పోలీసులు దాడి
ELR: ముసునూరు మండలంలోని బలివే గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడులు నిర్వహించినట్లు ఎస్సై ఎం.చిరంజీవి సోమవారం తెలిపారు. గ్రామ శివారులో పేకాడుతున్న ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి, వారి వద్ద నుండి 7400 నగదు, ఏడు మోటార్ సైకిళ్లు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.