కమిషనర్లకు అచ్చిరాని జగిత్యాల మున్సిపాలిటీ
JGL: జగిత్యాల మున్సిపాలిటీ కమిషనర్లకు అచ్చి రావడం లేదు. 2019 నుంచి ఇప్పటి వరకు 6 ఏళ్లలో దాదాపు 10 మంది కమిషనర్లు మారారు. మొదటి నుంచి జగిత్యాల మున్సిపల్లో పని చేసే అధికారులు ఏదో ఒక ఆరోపణలతోనే బదిలీ అయ్యారు. వీటిని దృష్టిలో పెట్టుకొని జగిత్యాలలో పని చేసేందుకు కొత్తవారు రావడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కాగా కమిషనర్ల విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.