షర్మిలను హౌస్ అరెస్ట్ చేయడం అమానుషం: రౌతు

షర్మిలను హౌస్ అరెస్ట్ చేయడం అమానుషం: రౌతు

తూ.గో: పీసీసీ చీఫ్ వై.ఎస్. షర్మిలను హౌస్ అరెస్ట్ చేయడం అమానుశమని కొత్తపేట కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి రౌతు ఈశ్వరరావు అన్నారు. ఆయన గురువారం కొత్తపేటలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని అన్నారు. దుర్మార్గంగా పోలీసులు మహిళ అని కూడా చూడకుండా షర్మిలను బలవంతంగా గెంటడం పట్ల దారుణమని ఆయన అన్నారు.