'ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటాలి'

BPT: మార్టూరులోని క్యాంపు కార్యాలయం నందు శుక్రవారం 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వతంత్ర సమరయోధుల బాటలో ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటాలని అన్నారు. విభిన్న జాతులు, మతాల కలయిక భారతదేశమని ఎమ్మెల్యే కొనియాడారు.