కోప్పేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్ ప్రమాణ స్వీకారం

కోప్పేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్ ప్రమాణ స్వీకారం

W.G: ఆకివీడు మండలం కుప్పనపూడి కోప్పేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్‌గా వేలాల నర్సింహారావు, 9 సభ్యులతో ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. పార్టీలకతీతంగా ఆలయ అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. సనాతన ధర్మాన్ని పాటిస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ స్వామివారికి కైంకర్యాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు.