పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం

పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం

AP: అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్‌గా దీనికి నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.