'కుటుంబీకులే వృద్ధురాలిని రోడ్డుపై వదిలేశారు'
NZB: ఆర్మూర్ పట్టణంలో మానవత్వం మరిచి ఓ వృద్ధురాలిని (70) కుటుంబీకులే రోడ్డుపై వదిలేసిన ఘటన చోటుచేసుకుంది. మానసిక పరిస్థితి బాగాలేకపోవడంతో, నిరుపేద కుటుంబం కావడంతో వైద్యం చేయించలేక, వారం రోజుల కిందట తహసీల్దార్ ఆఫీస్ సమీపంలో వదిలి వెళ్లారు. అధికారులు స్పందించి వృద్ధురాలిని వృద్ధాశ్రమంలో చేర్పించాలని స్థానికులు కోరుతున్నారు.