పెట్రోలు పోసి చంపేందుకు యత్నం.. కేసు నమోదు

పెట్రోలు పోసి చంపేందుకు యత్నం.. కేసు నమోదు

GNTR: తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపడానికి ప్రయత్నం చేసిన అన్నపై పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రామిరెడ్డితోటకు చెందిన ఆటోడ్రైవర్ సురేశ్‌కి అతని సోదరుడు రమేశ్‌కి మధ్య గతంలో విబేధాలు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం సురేశ్‌పై రమేశ్ పెట్రోల్ పోసి నిప్పంటిచి చంపేందుకు ప్రయత్నించగా అది విఫలమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.