జగిత్యాల 'గల్ఫ్ గోస' సభను జయప్రదం చేయాలి: కోటపాటి
NZB: ఈనెల 23న జరిగే చలో జగిత్యాల్ 'గల్ఫ్ గోస' సభను విజయవంతం చేయాలని ప్రవాస భారతీయుల హక్కులు, సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఆర్మూర్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక పాలసీ ప్రకటించి, అన్ని విధాలుగా అండగా ఉండాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.