సింహాద్రి ఎన్టీపీసీ మొదటి యూనిట్‌లో ఉత్పత్తికి అంతరాయం
AKP: పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ మొదటి యూనిట్ ఉత్పత్తికి శుక్రవారం రాత్రి అంతరాయం ఏర్పడింది. 500 మెగా యూనిట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లో బాయిలర్ ట్యూబ్‌ల్లో రంద్రాలు ఏర్పడడంతో ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇందులో యుద్ధ ప్రాతిపదికన మరమత్తు పనులు చేపడుతున్నామన్నారు. మిగిలిన మూడు యూనిట్లలో ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.