ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించిన ఎస్పీ

KMR: జిల్లా కేంద్రానికి చెందిన నలుగురు విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సందర్భంగా, శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర విద్యార్థులను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్తులో, ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.