డబ్బులు ఆశిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

డబ్బులు ఆశిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

PDPL: ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది డబ్బులు ఆశిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష హెచ్చరించారు. ఇవాళ కలెక్టరేట్‌లో GDK ఆసుపత్రి పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని, పోస్టుమార్టం సేవలు పూర్తిగా ఉచితమని, డబ్బులు ఆశించకూడదని సూచించారు. ఆసుపత్రిలో పరిశుభ్రతపై దృష్టి సారించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.