కేటీఆర్ రాజీనామా చేయాలి: రేవంత్

కేటీఆర్ రాజీనామా చేయాలి: రేవంత్

TG: సవాల్ విసరడం, పారిపోవడం మాజీమంత్రి కేటీఆర్‌కు అలవాటే అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 'డ్రగ్స్ టెస్ట్ సవాల్ విసిరితే పారిపోయాడు. కంటోన్‌మెంట్‌లో అభివృద్ధి చేసినట్లు చూపిస్తే రాజీనామా చేస్తా అన్నాడు. రూ.6వేల కోట్లు ఇచ్చినట్లు మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధారాలు చూపించారు. ఇప్పుడు నువ్వు రాజీనామా చెయ్ కేటీఆర్' అని పేర్కొన్నారు.