‘పునరావాస ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలి'

‘పునరావాస ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలి'

GDWL: రాజోలి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించే తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను పునరావాస కాలనీలోనే ఏర్పాటు చేయాలని అఖిలపక్ష కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ రామ్మోహన్, సర్పంచ్ గంగిరెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. మెజార్టీ ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలోనే వీటిని నిర్మించాలని వినతిపత్రంలో వారు కోరారు.