అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
RR: అగ్ని ప్రమాద వారోత్సవాల్లో భాగంగా చేవెళ్లలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అజాగ్రత్తే అగ్నిప్రమాదాలకు ప్రధాన కారణమని వివరించారు. ఇళ్లలో ఐఎస్‌ఐ వైరింగ్ వాడటం, గ్యాస్ లీక్ అయితే స్విచ్‌లు వేయకపోవడం, మంటలు అంటుకుంటే నేలపై దొర్లడం వంటి జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యాసంస్థలు, మాల్స్ నందు ఫైర్ అలారాలు, సరైన ఎగ్జిట్ మార్గాలు ఉండటం తప్పనిసరి అన్నారు.