పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

హైదరాబాద్ నగరంలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గోల్కొండ కోటపై ప్రభుత్వం నిర్వహించే వేడుకల కోసం చేపట్టే ఏర్పాట్లను డీజీపీ జితేందర్, ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలిసి సోమవారం మధ్యాహ్నం ఆమె పరిశీలించారు.