లిఫ్ట్ ప్రమాదంలో కార్మికుడు మృతి

BNR: లిఫ్ట్ ప్రమాదంలో ఓ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుడు మృతిచెందిన విషాద ఘటన చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మన్మధ కుమార్ వివరాల ప్రకారం.. ఏపీలోని బాపట్ల జిల్లాకి చెందిన సిరిగిరి శ్రీరామమూర్తి ప్రమాదవశాత్తు ఆదివారం లిఫ్ట్ ప్రమాదంలో మరణించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.