కర్నూలులో రెండో రోజు ఏసీబీ దాడులు
KRNL: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ శాఖలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే సమాచారం మేరకు మున్సిపల్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇందులో భాగంగా బుధవారం కర్నూలు మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు 2వ రోజు దాడులు నిర్వహించారు. కార్యాలయంలో ఉన్న సిబ్బందిని ఎక్కడికీ వెళ్లకుండా అక్కడే ఉంచారు.