భారీగా గుడుంబా ముడిసరుకు పట్టివేత
NLG: గుడుంబా తయారీకి ఉపయోగించే ముడిసరుకును ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారూ. 6వేల కిలోల నల్లబెల్లం, 200 బస్తాల పట్టికను తరలిస్తున్న డీసీఎంను ఆదివారం రాత్రి సీజ్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ ముడిసరుకును కర్ణాటక బీదర్ నుంచి తీసుకొచ్చి దేవరకొండ డివిజన్‌లోని మారుమూల గ్రామాల్లో విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.