దేవరకొండలో ఉచిత కరాటే సమ్మర్ క్యాంపు

NLG: దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ భవనంలో గురువారం ఉచిత మార్షల్ ఆర్ట్స్ కరాటే సమ్మర్ క్యాంపును అధ్యక్షుడు ఎన్వీటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఆత్మ రక్షణ కోసం కరాటే చాలా అవసరమని ముఖ్యంగా అమ్మాయిలకు చాలా అవసరమని అన్నారు. పిల్లల్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఈ ప్రాంభోత్సవంలో స్పోర్ట్స్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.