జిల్లాలో 8 మంది కానిస్టేబుళ్ల బదిలీ
సత్యసాయి: జిల్లాలో పలువురు కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఎస్పీ సతీష్ కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మవరం రూరల్ నుంచి రాఘవేంద్రను నల్లమాడకు, రామగిరి నుంచి సుబ్రహ్మణ్యంను అమడగూరుకు బదిలీ చేశారు. మొత్తం 8 మంది కానిస్టేబుళ్లు బదిలీ కాగా తక్షణమే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేయాలని ఎస్పీ ఆదేశించారు.