అక్రమ చేపల తరలింపు పట్టివేత..

NLR: కలువాయి మండలం దాచూరులో శుక్రవారం గ్రామస్థులు డ్యాం నుంచి అక్రమంగా చేపల తరలింపును అడ్డుకున్నారు. చేపల వేటపై ఆగస్టు 31 వరకు నిషేధం ఉంది. అయితే కొంత మంది నిబంధనను ఉల్లంఘిస్తూ 400 కేజీల చేపలను అక్రమంగా తరలిస్తుండగా గ్రామ మత్స్యకారులు పట్టుకున్నారు. అనంతరం సమాచారాన్ని వారు ఏడీకి తెలియజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.