కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు: ఎస్పీ
NLG: కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చునని దానికి విద్య ప్రధాన ఆయుధమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ఆదివారం చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో నాతి లక్ష్మీనరసింహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్య, ఉద్యోగ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్య అనేది ఏ ఒక్కరి సొంతం కాదని SP పేర్కొన్నారు.