పల్లె గడ్డ రహదారికి మరమ్మత్తులు
NRPT: మరికల్ నుంచి పల్లె గడ్డకు వెళ్లే రహదారి గుంతల మయంగా మారిన విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఓ ఫౌండేషన్ ఛైర్మన్ సూర్య మోహన్ రెడ్డి మంగళవారం సొంత నిధులతో రోడ్డుకు మరమ్మతులు చేయించారు. గుంతలు ఏర్పడిన చోట బీటీ వేయించారు. పల్లె గడ్డ, తీలేరు, పూసలపహాడ్గ్ గ్రామాలకు వెళ్లే వాహనదారుల ఇబ్బందులను గుర్తించి ఈ మరమ్మత్తులు చేయించారు.