కార్మిక హక్కుల కోసం కర్నూలులో ధర్నా
KRNL: భవన, ఇతర నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు నగర అధ్యక్షుడు డి. అబ్దుల్ దేశాయి ఆదివారం తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, కార్మికులకు పింఛన్, బీమా, ఇల్లు స్థలం వంటి ప్రాథమిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.