ఆచార్య వెలమల సిమ్మన్నకు లోక్ నాయక్ పురస్కారం
VSP: తెలుగు భాషా సాహిత్యానికి విశేష కృషి చేసిన ఏయూ ప్రొఫెసర్, శతాధిక గ్రంథకర్త ఆచార్య వెలమల సిమ్మన్నకు ఈ ఏడాది లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాన్ని ప్రకటించారు. ఫౌండర్, పద్మశ్రీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ అవార్డులను ఎన్టీఆర్ వర్ధంతిన ప్రదానం చేస్తారు.