'యూరియా కావాలంటే యాప్‌లోనే బుకింగ్'
NLG: యూరియా పక్కదారి పట్టకుండా రైతులకు మాత్రమే అందే విధంగా ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను తీసుకురానుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తెలిపారు. నిన్న హైదరాబాదులో అధికారులతో జరిగిన సమీక్షలో ఈ విషయాన్ని ఆయన పేర్కొన్నారు. ఈనెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో రైతుల అవగాహన కోసం వ్యవసాయ, ఉద్యాన, కో-ఆపరేటివ్ అధికారులు సమిష్టిగా పని చేయాలన్నారు.