తొలి విడతలో ఏకగ్రీవమైన పంచాయతీలు
SRCL: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 9 గ్రామపంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం అయ్యాయి. రుద్రంగి మండలంలో పది పంచాయతీలకు గాను ఏడు పంచాయతీలలో సర్పంచు, వార్డు స్థానాలు పూర్తిగా ఏకగ్రీవం కాగా, కోనరావుపేట మండలంలో 28 పంచాయతీలకు గాను రెండు పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు తెలిపారు. చందుర్తి, వేములవాడ, వేములవాడ రూరల్ మండలంలో ఒక పంచాయతీ కూడా ఏకగ్రీవం కాలేదు.