ఇమామ్–మౌజన్‌లకు గౌరవ వేతనాల పంపిణీ
PLD: నరసరావుపేట నియోజకవర్గంలో మొత్తం 50 మంది ఇమామ్‌లు, మౌజన్‌ల బ్యాంకు ఖాతాల్లో గౌరవ వేతనం నేరుగా జమ చేయగా, గురువారం నరసరావుపేట టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు స్వయంగా ఈ గౌరవ వేతనాలను అందజేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మైనారిటీ సోదరుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని ఎమ్మెల్యే తెలిపారు.