రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు

NRML: భైంసా-బాసర జాతీయ రహదారిపై అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విటోలి తాండకు చెందిన పవార్ అవినాష్, అంజలి దంపతులతో పాటు వారి ఇద్దరు కుమార్తెలకు గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనాన్ని కూరగాయల వాహనం ఢీకొట్టిడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారులను నిజామాబాద్‌కు తరలించగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.