దుకాణాల కేటాయింపునకు 19న డ్రా
KMM: ఖమ్మం పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణంలో వ్యాపారులకు దుకాణాల కేటాయింపునకు ఈనెల 19న స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో డ్రా తీయనున్నట్లు కేఎంసీ అధికారులు తెలిపారు. ఈమేరకు 18, 19న రెండు రోజులు వీధి వ్యాపారుల ప్రాంగణం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు చెప్పారు. డిపాజిట్లు చెల్లించిన వ్యాపారులు ఉదయం 11 గంటలలోపు చేరుకోవాలన్నారు.