'పరకామణి చోరీ కేసుపై హైకోర్టుకు నివేదిస్తాం'
AP: పరకామణి చోరీ కేసుపై డిసెంబర్ 2న హైకోర్టుకు నివేదిస్తామని సీఐడీ డీజీ రవిశంకర్ పేర్కొన్నారు. తిరుమలలో పరకామణి చోరీ కేసు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసుపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందన్నారు. బృందాలుగా విడిపోయి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.