వ్యవసాయానికి తొమ్మది గంటల విద్యుత్ ఇవ్వాలి

రైతుల వ్యవసాయ మోటర్లకు 9 గం. విద్యుత్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు, రైతులు గురువారం రంగంపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌కి భారీ ర్యాలీగా వెళ్లారు. వ్యవసాయానికి 9 గం. కరెంట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే విద్యుత్ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. వైసీపి అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతున్న రైతుల కష్టాలు తీరలేదని ఆరోపించారు.