'కొనుగోలు సమయంలో తప్పనిసరిగా రసీదు తీసుకోండి'

'కొనుగోలు సమయంలో తప్పనిసరిగా రసీదు తీసుకోండి'

BPT: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ మాట్లాడుతూ.. వస్తువులు కొనుగోలు చేసే సమయంలో ఐఎస్‌ఐ గుర్తు పరిశీలించి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. నాణ్యమైన ఆహార పదార్థాలు, తూనికలు-కొలతల యంత్రాలపై ప్రదర్శన కూడా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.