తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
KRNL: తిరుమలలో శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి గురువారం దర్శించుకున్నారు. దర్శనార్థం కోసం వచ్చిన వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొనారు.