VIDEO: విశాఖలో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి
VSP: ‘రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజా సాబ్’ విడుదల సందర్భంగా విశాఖలో అభిమానుల సందడి నెలకొంది. గురువారం అర్ధరాత్రి నగరంలోని సంగం-శరత్ థియేటర్లలో నిర్వహించిన బెనిఫిట్ షోకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. థియేటర్ వద్ద ప్రభాస్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.