'రైతులకు కచ్చితంగా టార్పాలిన్ అందజేయాలి'
SRCL: సిరిసిల్లలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కచ్చితంగా టార్పాలిన్లు అందజేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇంఛార్జి కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు, వడ్ల తేమ శాతం పరిశీలించారు.