బీచ్ ఫెస్టివల్ ప్రమోట్ చేసేలా ఫ్లాష్ మాబ్
BPT: SEP 26, 27, 28 తేదీల్లో జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో నిర్వహించే బీచ్ ఫెస్టివల్‌కు వినూత్న ప్రచారం కల్పించేందుకు టూరిజం శాఖ సిద్ధమైంది. రాష్ట్రంలోని వర్సిటీల భాగస్వామ్యంతో సూర్యలంక, విజయవాడ, తిరుపతి, గుంటూరు, హైద్రాబాద్‌లో ఫ్లాష్ మాబ్ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులను SEP 27న వరల్డ్ టూరిజం డే రోజు CM చంద్రబాబు సత్కరిస్తారు.