అదుపుతప్పి బోల్తా పడ్డ లారీ

అదుపుతప్పి బోల్తా పడ్డ లారీ

NRML: భైంసా జాతీయ రహదారిపై తౌడ్ లోడుతో వెళ్తున్నా ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మహారాష్ట్ర జంతుర్ నుంచి దేవరపల్లికి తౌడ్ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి చాక్పెళ్లి సమీపంలో జాతీయ రహదారి పై అడ్డంగా పడిపోయిందన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.