సుంకేసులకు కొనసాగుతున్న వరద
GDWL: రాజోలి మండలం సుంకేసుల బ్యారేజీకి వరద కొనసాగుతోంది. బుధవారం సాయంత్రానికి బ్యారేజీకి ఇన్ ఫ్లో 5,200 క్యూసెక్కులు వచ్చింది. దీంతో అధికారులు ఒక గేటు ఎత్తి 2,280 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కేసీ కెనాలు 2,445 క్యూసెక్కులు వదులుతూ.. మొత్తం 4,725 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీలో 1.235 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.