కమనీయంగా సీతారాముల కళ్యాణం

కమనీయంగా సీతారాముల కళ్యాణం

NLR: బుచ్చి మండలం పంచేడులో సీతారాముల కళ్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మ వార్లను పరిమళ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి, వేదమంత్రాల నడుమ, వేద పండితులు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ నేత సుర శ్రీనివాసులు దంపతులు వ్యవహరించారు.