హార్వర్డ్ వర్సిటీపై ట్రంప్ యంత్రాంగం దావా
హార్వర్డ్ వర్సిటీపై అమెరికా న్యాయశాఖ కోర్టులో దావా వేసింది. వర్సిటీ క్యాంపస్‌లో యూదు వ్యతిరేకతను, యూదుల పట్ల వివక్షను నిలువరించడంలో వర్సిటీ నాయకత్వం విఫలమైందని ఆరోపించింది. అందుకే ప్రభుత్వం వర్సిటీకి రాయితీల రూపంలో అందించిన వందల కోట్ల డాలర్ల ప్రజా ధనాన్ని తిరిగి వసూలు చేసుకోవాలని నిర్ణయించిందని తెలిపింది. ఈ చర్యకు ఆ వర్సిటీ వైఖరే కారణమని పేర్కొంది.